చాలా మంది బిజినెస్ పీపుల్స్ సరదాగా వారికి విశ్రాంతి అంటే కచ్చితంగా సినిమా అనే అంటారు ఈ సమయంలో మార్కెట్లో వచ్చిన సినిమాలు చూస్తారు.. అయితే అవి బాగున్నాయి అంటే కచ్చితంగా ఆ హీరోలని ఫోన్ చేసి మరీ విషెస్ చెప్పుతారు.
అయితే తాజాగా హీరో రామ్ చరణ్ గురించి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధామూర్తి కొన్ని విషయాలు చెప్పారు .. తాను చరణ్ సమంత కలిసి నటించిన రంగస్థలం చిత్రం చూశాను అని చెప్పారు. ఇందులో చరణ్ బాగా నటించారు అని చెప్పారు, మెగా పవర్ స్టార్ రామ్చరణ్, సమంత నటించిన తెలుగు సినిమా రంగస్థలం ఎంత సక్సెస్ అయిందో తెలిసిందే.
అలాగే మనం చిత్రం కూడా చూశాను అది కూడా చాలా బాగుంది అని ఆమె తెలిపారు, ఇక కన్నడ సినిమాలు తానెక్కువగా చూస్తాను అని అన్నారు.
తన బాల్యంలో ఎన్టీ రామారావు సినిమాలు చూసేదానినని సుధామూర్తి తెలిపారు. మాయాబజార్, దాన వీర శూర కర్ణతో పాటు పలు సినిమాలను చూశానని చెప్పారు. శ్రీ కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదని, తన దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరేనని ఆమె అన్నారు.. తాజాగా ఆమె ఓఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు.