చిరంజీవి పెరట్లో ఆ చెట్టు గురించి ఆసక్తికర కామెంట్స్ (వీడియో)

0
99

ఎప్పుడు సోషల్ మీడియాలో ఆక్టివ్ గా వుండే మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వీడియోలో చిరు మాట్లాడుతూ..రైతు పంట పండించి ఆ పంట కోసి ఇంటికి తీసుకెళ్తే ఆ ఆనందం ఎలా ఉంటుందో అందులో కొంచెం సంతోషం నాకు ఈరోజు కలుగుతుంది. ఎందుకంటే నేను కొన్ని రోజుల క్రితం సరదాగా నాటిన సొరకాయ విత్తనం నేడు పాదై రెండు సొరకాయలు కాసింది. ఇవి నేను స్వయంగా కోసి కూర వండుకొని తిని ఆస్వాదిస్తానని చిరు పేర్కొన్నాడు. ప్రకృతి ఎంత గొప్పదంటే సరదాగా నాటిన విత్తనం నేడు కడుపు నింపుతుందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు మెగాస్టార్. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

https://fb.watch/aHt5jBIDbb/