యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్(Adipurush)’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదల కానుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్నాడు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన పాటలు, పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడి రోల్ పోషిస్తున్నాడు. రామాయణంలో లక్ష్మణుడి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా.. లక్ష్మణుడి పాత్రపై బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ లహ్రి స్పందించాడు. యువ నటుడు సన్నీ సింగ్(Sunny Singh) లక్ష్మణుడి పాత్ర(Lakshman Character) చేయడంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ట్రైలర్‌లో లక్ష్మణుడి పాత్ర నిడివి చాలా తక్కువ కాబట్టి.. అప్పుడే జడ్జ్ చేయలేం. అయితే సన్నీ సింగ్ మంచి యాక్టర్ అని, గతంలో ఉన్న రెఫరెన్స్‌ల ఆధారంగా లక్ష్మణుడి పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడని నమ్ముతున్నట్టు చెప్పాడు. మేకర్స్ లక్ష్మణుడి పాత్రను ఎంత పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేశారనే దానిపైనే నటుడి పర్‌ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చారు.