‘సర్కారు వారి పాట’ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు డేట్ ఫిక్స్

0
194

స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వంలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. మహేష్‌ బాబు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వైరవిశంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా బాధ్యతలు స్వీకరించి తెరెకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఇటీవలే సర్కార్ వారి పాట ట్రైలర్  రిలీజ్ చేసి మహేష్ అభిమానులకు ఆనందపరిచింది. ఈ సినిమా మే 12న విడుదలై థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ పైన దృష్టి పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వదిలింది చిత్ర బృందం.

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మే 7న నిర్వహించబోతున్నట్టు అనౌన్స్ చేసి ప్రేక్షకులను ఖుషి చేశారు. తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గౌడ పోలీస్ గ్రౌండ్స్ ను ప్రీ రిలీజ్ ఈ వెంట్ ఫంక్షన్ నిర్వహించనున్నట్టు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకోబోతుందో.