మోహన్ లాల్, మీనా జంటగా దృశ్యం సినిమా ఎంత సూపర్ హిట్టో తెలిసిందే, ఈ సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చాయి, ఇక ఏ భాషలో చేసినా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది…జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా అద్బుతంగా తెరకెక్కింది.
తెలుగులో వెంకటేశ్ తో నిర్మించగా ఇక్కడా పెద్ద హిట్టయింది. ఇక హిందీలో కూడా బీటౌన్ ని షేక్ చేసింది.
ఇక ఇటీవల దృశ్యం 2 కూడా తీశారు, ఈ సీక్వెల్ కూడా సూపర్ హిట్ అయింది. దీనిని తెలుగులో మళ్లీ వెంకటేశ్, మీనాలతోనే ఇక్కడా రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాపై మరో అప్ డేట్ కూడా వచ్చింది… ఏమిటి అంటే
దృశ్యం 3 కూడా వస్తుంది అన్నారు, అంతేకాదు ఈ చిత్రం కూడా త్వరలో వస్తుంది అని తెలిపారు.
ఇప్పటికే దీనికి సంబంధించిన కథను మోహన్ లాల్ కు, నిర్మాతకు చెప్పానని, ఇక ఆ క్లైమాక్స్ వారికి బాగా నచ్చింది అని తెలిపారు. ఇక కథపై ఇంకా కాస్త వర్క్ జరుగుతోంది అని తెలిపారు, ఇక ఇది కూడా అన్నీ సెట్ అయితే ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని వెల్లడించారు..ప్రస్తుతం జీతూ జోసెఫ్ తెలుగు దృశ్యం 2 తీస్తున్నారు.