టాలీవుడ్ లో అపజయం తెలియని దర్శకుడు అంటే రాజమౌళి అని చెప్పాలి, ఆయన సినిమా తీస్తున్నారు అంటే యావత్ దేశం ఆ సినిమా గురించి చూస్తోంది, భారీ బడ్జెట్ సినిమాలే ఆయన చేస్తున్నారు, విభిన్న సినిమాలు తెరకెక్కిస్తున్నారు.
అయితే ఆయన ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేయాలి అని చాలా మంది కోరుకుంటున్నారు, మంచి కథ సెట్ అయితే ప్రిన్స్ తో చేయడానికి రాజమౌళి కూడా రెడీగా ఉన్నారు, ఇప్పటికే దీనిపై పలు వార్తలు వినిపించాయి.
తాజాగా జక్కన్న.. ఓ మీడియాకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఇస్తూ తన తదుపరి మూవీ మహేష్ బాబుతో ఉండనుందని కన్ఫర్మ్ చేశారు. ఇక అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ మూవీ వచ్చే ఏడాది ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఉంటుంది అని భావిస్తున్నారు అభిమానులు, అయితే 2021 లో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది అని కాని రెండేళ్లు పడుతుంది అని తెలుస్తోంది… మొత్తానికి 2023 లో లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రాన్ని మహేష్ బాబు చేస్తున్నారు.