టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతోంది.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, ఇక విడుదల తేదీ కూడా ఇచ్చేశారు, ఇందులో చాలా మంది సీనియర్ నటులు నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే ఇందులో ప్రముఖ యాంకర్ అనసూయ ఓ కీలక రోల్ చేస్తోంది అని
కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి.
తాజాగా ఆ ప్రచారాలను ఖండిస్తూ ఓపెన్ అయింది జబర్దస్త్ బ్యూటీ. అసలు తను ఈ సినిమాలో నటించడం లేదు అని తెలిపింది..
ఈ చిత్రం గురించి చిత్ర యూనిట్ తనని సంప్రదించలేదు అని తెలిపింది, అయితే నిజంగా ఇందులో నాకు ఆఫర్ వస్తే కచ్చితంగా నటిస్తాను అని చెప్పింది అనసూయ.
ప్రస్తుతం తనకు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పిన అనసూయ, ఎన్ని అవకాశాలు వచ్చినా బుల్లితెరను మాత్రం వదిలి పెట్టనని చెప్పుతోంది, ముఖ్యంగా జబర్ధస్త్ ద్వారా ఆమె ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది.. అందుకే ఆ షోలో ఆమె కంటిన్యూ అవుతున్నారు, ఇక దాదాపు ఆమె చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉన్నాయట.