బింబిసార-2 లో బాలయ్య నటించబోతున్నాడా? ఇదిగో క్లారిటీ..

0
116
కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. ఈ సినిమాతో వశిష్ట్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రల్లో ప్రకాశ్ రాజ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ కథతో తెరెకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆగష్టు 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ గా బింబిసారా -2 రాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను హీరో నందమూరి బాలకృష్ణ శనివారం థియేటర్​లో వీక్షించారు. అనంతరం బింబిసార చిత్రబృందాన్ని అభినందించారు. అద్భుతమైన ప్రయత్నమంటూ ప్రశంసించారు.

ఇక అదే సమయంలో బాలకృష్ణ కళ్యాణ్ రామ్ తో కలిసి ఒక సినిమా చేద్దామని హామీ కూడా ఇచ్చారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని అభిప్రాయాన్ని బాలయ్య అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇక అంతే కాకుండా బింబిసారా -2 లో బాలయ్యకు ఏదైనా పాత్ర సెట్ అయితే కచ్చితంగా నటించే అవకాశం ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సినిమా సీక్వెల్స్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు.