జెనీలియా వెండితెరపై మళ్లీ సందడి చేయనుందా? పదేళ్ల తరువాత తొలిసారి..

0
114

నటి జెనీలియా వెండితెరపై మళ్లీ సందడి చేయనుందా? ఏకంగా పదేళ్ల గ్యాప్ తరువాత తెరపై మెరిసేందుకే రెడీ అవుతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అయితే తన రీఎంట్రీ సినిమా ఏంటి? ఎలాంటి క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది? అనే సందేహాలు అభిమానుల్లో ఉండిపోయాయి.

తెలుగు-కన్నడ భాషల్లో రూపొందుతున్న ఓ చిత్రంలో శ్రీలీల కథానాయిక కాగా..మరో పాత్రలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో గా జెనీలియా నటిస్తుందని తెలుస్తోంది. ఈ పాత్రకు కథలో ప్రాధాన్యమున్నట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్‌రెడ్డి కుమారుడు కిరిటీ కథానాయకుడిగా ఈ చిత్రం రూపొందుకుంటుండగా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు.

దేవీశ్రీప్రసాద్‌ దీనికి స్వరాలిందిస్తున్నారు. కన్నడ ప్రముఖ నటుడు రవిచంద్రన్‌ ఇందులో మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. పదేళ్ల తరువాత జెనీలియా రీఎంట్రీ ఆ తరువాత తన కెరియర్ ఎలా కొనసాగుతుందో చూడాలి మరి.