ఎఫ్2కు సీక్వెల్ ఎఫ్ 3 రానుంది ..ఇప్పటిక చిత్ర ప్రకటన వచ్చేసింది ..వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇక వరుణ్ తేజ్ వెంకటేష్ ఈ సినిమాలో నటించనున్నారు, అయితే కొద్ది రోజులుగా ఓ వార్త వినిపిస్తోంది, ఇందులో మరో హీరో కూడా ఉన్నారు అని ..అంతేకాదు ముందు రవితేజ పేరు వినిపించింది.. తర్వాత మరో ఇద్దరు యంగ్ హీరోల పేర్లు వినిపించాయి, అయితే తాజాగా మరో హీరో పేరు టాలీవుడ్ లో వినిపిస్తోంది.
వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో గోపీ చంద్ నటిస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే కొందరు మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే అంటుంటే కాదు ముగ్గురు ఉన్నారు అని అంటున్నారు, సో దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.
కాని టాలీవుడ్ లో మాత్రం ముగ్గురు హీరోలు అని వార్తలు వినిపిస్తున్నాయి… ఎఫ్3 సినిమా తన చిత్రీకరణను వచ్చే ఏడాదిలో ప్రారంభించనుంది. ఇక వచ్చే ఏడాది ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయనున్నారట, ఇటు సంక్రాంతి తర్వాత షెడ్యూల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.