మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా – సౌత్ ఇండియా సూపర్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవల అనౌన్స్ చేశారు, ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఆచార్య తర్వాత చరణ్ సినిమాని సెట్స్ పై పెట్టనున్నారు.. ఇక ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. మరి ఇంత పెద్ద బడ్జెట్ సినిమాకి ఎవరు సంగీతం అందించనున్నారు అనే దానిపై వార్తలు వినిపిస్తున్నాయి అప్పుడే.
ఇక కోలీవుడ్ టాలీవుడ్ లో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుధ్ స్వరాలను సమకూర్చనున్నాడని వార్తలు వస్తుంటే, ఈ సినిమాకి రెహమాన్ బాణీలు ఇస్తారు అని వార్తలు వినిపిస్తున్నాయి… అయితే దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి అని అంటున్నారు.
ఈ సినిమా భారీ బడ్జెట్ తో తీస్తున్నారు… ఈ స్టోరీ వర్క్ మొత్తం పూర్తి అయింది…ఇక ఆచార్య సినిమా పూర్తి అయిన తర్వాత దీనిపై ప్రకటన రావచ్చు… ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది అనేది త్వరలోనే తెలియచేస్తారు. ఈ సినిమా 200 కోట్ల బడ్జెట్తో వస్తున్నట్లు తెలుస్తోంది.పాన్ ఇండియా సినిమాగా ఇది వస్తోంది.