నటసింహం బాలయ్య రెమ్యునరేషన్ ఈ రేంజ్ లోనా?

0
114

బాలయ్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపి చంద్ మలినేనితో NBK 107 సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత అనిల్ రావిపూడితో మరో సినిమా ప్లాన్ చేశాడు. ఇవే కాక ఆదిత్య 369కి సీక్వెల్, అఖండ సీక్వెల్ కు నందమూరి నటసింహం ప్లాన్ చేస్తున్నాడు.

మరోవైపు బాలయ్య అన్​స్టాపబుల్​ షోను ఓ రేంజ్ కు తీసుకెళ్లారు. ఈ షో తొలి సీజన్​ సూపర్​హిట్​ అవ్వడం వల్ల రెండో సీజన్​ కోసం వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండో సీజన్​ కోసం బాలయ్య రెమ్యునరేషన్​ భారీగానే డిమాండ్​ చేసినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ సీజన్‌లో ఒక్కో ఎపిసోడ్​ కోసం దాదాపు రూ.40 లక్షలకుపైగానే తీసుకుంటున్నారట. దీంతో మొత్తం 12 ఎపిసోడ్లు పూర్తిచేసేసరికి ఆయన దాదాపు రూ.6 కోట్లు ఆర్జించారని సమాచారం. ఇక రెండో సీజన్‌కు తన పారితోషికాన్ని రెట్టింపు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై సోషల్​మీడియాలో వార్తలు వస్తున్నాయి.