ధనుష్(Dhanush), నయనతార(Nayanthara) మధ్య కాపీరైట్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఈ క్రమంలో తాజాగా నయనతార ఇంట్రస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టింది. ప్రస్తుతం సినీ వర్గాల్లో ఎక్కడ చూసినా అదే చర్చ జరుగుతుంది. కర్మ సిద్ధాంతాన్ని ఉద్దేశించి నయనతార పెట్టిన పోస్ట్ కచ్ఛితంగా ధనుష్‌ను ఉద్దేశించి చేసిందేనని మరికొందరు బల్లగుద్ది చెప్తున్నారు. ఇంతకీ నయనతార ఏమని పోస్ట్ పెట్టిందంటే.. ‘‘మీరు ఒకరి జీవితాన్ని అబద్ధాలతో నాశనం చేయాలని చూస్తే దానిని తప్పుగా గుర్తించండి. అది రెట్టింపు వడ్డీతో తిరిగి వస్తుందని గుర్తుంచుకోండి’’ అని నయనతార తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అయితే ఇటీవల నయనతార జీవితాన్ని ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమంటరీలో ‘నానుమ్ రౌడీదాస్’ సన్నివేశాలను నిర్మాత ధనుష్ అనుమతులు లేకుండా వినియోగించారని పేర్కొంటూ నయనతార దంపతులపై ధనుష్ కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలోనే నయనతార(Nayanthara) ఈ పోస్ట్ పెట్టారని సినీ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.