Devara | దేవర ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయిందా?

-

ఎన్‌టీఆర్(NTR) హీరోగా వచ్చిన ‘దేవర(Devara)’ దెబ్బకు బాక్సాఫీస్ దద్దరిల్లిపోయింది. అభిమానుల అంచనాలను మించి ఈ సినిమా పర్ఫార్మ్ చేసింది. కొరటాల(Koratala Siva) మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కేశాడని ప్రేక్షకులు అంటున్నారు. రాజమౌళితో సినిమా తర్వాత వెంటనే హిట్ కొట్టిన హీరోగా కూడా ఎన్‌టీఆర్ రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు చేసింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) కూడా తన డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో హిట్‌ను కూడా కొట్టేసింది. ఇప్పుడంతా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించే చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ‘దేవర’ ఓటీటీ రిలీజ్‌కు మూవీ టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసిందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

‘దేవర(Devara)’ అతి త్వరలోనే ఓటీటీలో కూడా సందడి చేయనున్నాడు. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను మూవీ టీమ్ పూర్తి చేసింది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే నవంబర్ 8న ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తేవాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారన్న వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అయితే నవంబర్ 8 నుంచి ఈ సినిమా దక్షిణాది ప్రేక్షకులకు అందుబాటులోకి రానుందని, నవంబర్ 22 నుంచి బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుందని టాక్. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. లేదంటే నవంబర్ 8 వరకు వేచి చూడాల్సిందే.

Read Also: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ ఎలా ఉందంటే..
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...