Tamanna Bhatia | పెళ్ళి పీటలెక్కనున్న తమన్నా.. వరుడు అతడే..!

-

మిల్కీబ్యూటీ తమన్నా భాటియా(Tamanna Bhatia) పెళ్ళి ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా అతి త్వరలోనే అమ్మడు మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుందని టాక్ వినిపిస్తోంది. తన ప్రియుడు విజయ్ వర్మ(Vijay Varma)తో ఉన్న బంధాన్ని మరింత బలపరచాలని నిశ్చయించుకుందట. అందుకే విజయ్ కూడా ఓకే చెప్పడంతో ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఏడడుగులు వేయడానికి రెడీ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టుకుంటున్నారని, అంతకన్నా ముందు కలిసి నివసించడానికి మంచి నివాసం కోసం విజయ్, తమన్నా ఇద్దరూ వెతుకుతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతా ఫిక్స్ అయితే వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో వీరి వివాహం జరగొచ్చని సమాచారం.

ఇప్పటి వరకు తమ పెళ్ళికి ఈ ప్రేమ పావురాలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్ళి సందడి మొదలైపోయిందని సన్నిహితులు చెప్తున్నారు. తమ రిలేషన్‌ను మరో మెట్టు ఎక్కించాలన్న విషయంలో తమన్నా, విజయ్ ఇద్దరూ కూడా చాలా సీరియస్‌గా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పరిశ్రమలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

ఈ శుభవార్త అధికారికంగా తెలియడం కోసం మిల్కీ బ్యూటీ(Tamanna Bhatia) అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. కాగా వీరిద్దరూ తమ లవ్ స్టోరీని కూడా 2023లో ‘లస్ట్ స్టోరీస్ 2’ మూవీ రిలీజ్ సందర్భంగా కొన్నాళ్ల పాటు ఊరించి ఊరించి చెప్పారు. ఇప్పుడు పెళ్ళి కబురును కూడా అలానే చేస్తారా అన్న టాక్ కూడా నడుస్తోంది. మరి చూడాలి.. ఈ విషయంపై వీరు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో.

Read Also: ‘నాన్న బయోపిక్ చేయడం చాలా కష్టం’
Follow US: Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...