బిగ్ బాస్5: ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ ఖాయమా?

Is that contestant elimination safe this week?

0
112

చూస్తుండ‌గానే బిగ్ బాస్‌లో 50 రోజులు పూర్త‌య్యాయి. హౌజ్‌మేట్స్ ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఇప్ప‌ట‌కే ఏడుగురు బ‌య‌ట‌కు రాగా, ఈ వారం మ‌రొక‌రు ఎలిమినేట్ కాబోతున్నారు. ప్ర‌స్తుతం నామినేష‌న్‌లో లోబో, రవి, షణ్ముఖ్ జస్వంత్, మానస్, శ్రీరామ్, సిరి ఉండ‌గా వీరిలో ఒక‌రు ఎలిమినేట్ కానున్నారు.

రవి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్ వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నామినేష‌న్‌లో ఉన్న ప్ర‌తిసారి వీరికి ఓటింగ్ గ‌ట్టిగానే జ‌రుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ న‌లుగురు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈవారం నామినేషన్ అయితే వ్య‌క్తి సిరి లేదా లోబో అని అంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లోకి రీ ఎంట్రీ తరువాత కూడా లోబో పూర్తిగా డల్ అయ్యాడు.

లోబోకి ఈ మ‌ధ్య స్క్రీన్ స్పేస్ అనేదే లేదు. రాను రాను ఆయ‌న ఆట త‌గ్గుతూ వ‌స్తుంది. సిరి క‌న్నా లోబోకే తక్కువ ఓట్స్ వ‌స్తున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ వారం లోబో బిగ్ బాస్ హౌస్ వీడి బస్తీకి వచ్చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఒకవేళ లోబోని సేవ్ చేయాలనుకుంటే బిగ్ బాస్ ముందున్న మార్గాలు ఒకటి ఎలిమినేషన్‌ని ఎత్తేయడం. రెండోది సిరిని ఎలిమినేట్ చేయడం. షణ్ముఖ్ హౌస్‌లో ఉండగా సిరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే లేదు. వీరిద్ద‌రి నుండి మంచి కంటెంట్ వ‌స్తుంది. ఈ నేప‌థ్యంలో లోబో ఎలిమినేష‌న్ ప‌క్కా అంటున్నారు.