మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ఆ హీరోయిన్ ఫిక్స్ అయిందా ?

Is that heroine fix as the younger sister of megastar Chiranjeevi?

0
97

మెగాస్టార్ చిరంజీవి తమిళ చిత్రం వేదాళంను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్కడ తమిళంలో అజిత్ చేసిన పాత్ర ఇక్కడ చిరంజీవి చేస్తున్నారు. ఈ సినిమాలో కొద్దిగా మార్పులతో కథ సిద్దం చేసుకున్నారు. ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మరి ఈ సినిమాలో సిస్టర్ గా ఎవరు నటిస్తారు అంటే చాలా మంది పేర్లు వినిపించాయి.

ముందు ఈ పాత్రలో సాయి పల్లవి పేరు వినిపించింది. ఆ తర్వాత కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీంతో చిరుకి చెల్లిగా కీర్తి సురేష్ ఫైనల్ చేశారని టాలీవుడ్ టాక్ నడుస్తోంది. ఇక చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించడానికి ఆమె కూడా సిద్దంగా ఉన్నారట. ఇక భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు అని తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందట. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా డైరెక్షన్ లో లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.