ప్రభాస్ 25 వ చిత్రం కోసం ఆ నిర్మాత రెడీ అవుతున్నారా ?

Is the producer ready for Prabhas 25th film?

0
88

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలు. ఇక ఆయనకు కథలు వినిపించేందుకు చాలా మంది దర్శకులు సిద్దంగా ఉన్నారు. బాలీవుడ్ దర్శకులు కూడా ప్రభాస్ తో సినిమాలు చేయడానికి కథలు వినిపించడానికి ఇక్కడకు వస్తున్నారట. ఇప్పటికే రాధే శ్యామ్ సిద్ధమవుతోంది రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు ఈ సినిమాకి , అభిమానులకి ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

ఇక సెట్స్ పై సలార్ మూవీ ఉంది ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఇక మరో సినిమా ఓంరౌత్ తో చేస్తున్న ఆది పురుష్ .ఈ చిత్రం కూడా సెట్స్ పై ఉంది. ఇక ఈరెండు చిత్రాలు అయిన తర్వాత టాలీవుడ్ దర్శకుడు
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథ ఇది ఆయనకు 24 వ సినిమా అవుతుంది.

అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఓ చర్చ నడుస్తోంది. ఆయన 25 వ సినిమా ఎవరితో చేస్తారు? ఏ దర్శకుడితో ఏ బ్యానర్ లో ఆ సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. టాలీవుడ్ వార్తల ప్రకారం 25వ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో చేయనున్నట్టు ఒక వార్త వినిపిస్తోంది. వచ్చే ఏడాది దీనిపై ప్రకటన రావచ్చు అంటున్నారు. చూడాలి దీనిపై అఫిషియల్ ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.