జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా ఇటు సినిమాలు చేస్తున్నారు, తాజాగా ఆయన నటించిన వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ పూర్తి అయింది… ఇక విడుదల తేదీ కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.. మరో మూడు చిత్రాలు కూడా అనౌన్స్ చేశారు ఆయన.. ఇక అవి కూడా త్వరలో షూట్ జరుగనున్నాయి.
ఇక ఏప్రిల్ 9న వకీల్ సాబ్ చిత్రం విడుదల కానుంది, ఇక పవన్ కల్యాణ్ రానా కాంబినేషన్ లో మరో చిత్రం వస్తోంది ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తునన్నారు. అయితే ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడుతారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ అభిమానులు ఈ టైటిల్ గురించి అనేక పేర్లు అనుకుంటున్నారు, అయితే మలయాళ చిత్రం రీమేక్ గా ఇది వస్తోంది, మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం ఇది, ఇక తెలుగులో దీనికి మంచి పవర్ ఫుల్ టైటిలో ఆలోచించారు అని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ లో..
హరిహర వీరమల్లు అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి, మరి చూడాలి టైటిల్ ఏమై ఉంటుందో.