ధనుష్, ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?

Is this the reason for Dhanush and Aishwarya's divorce?

0
72

తమిళ స్టార్ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని వారు అధికారికంగా తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు. వీరికి 18 ఏళ్ల కిందట వివాహం జరిగింది. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలాని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే .ఆ సమయంలో ధనుష్‌-ఐశ్వర్యల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. మామగారి(రజనీకాంత్‌)జోక్యంతో మళ్లీ వీరు కలిసిపోయారు. అయితే ఈ సారి ధనుష్‌ కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే గత కొంతకాలంగా ఐశ్వర్య దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ధనుష్‌కు ఉన్న అఫెర్లను ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.