త్రివిక్రమ్-మహేష్ బాబు మూవీ కథ ఇదేనా? బీస్ట్ లుక్ అందుకేనా..

0
111

టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూపర్ స్టార్ ఇటీవల “సర్కారు వారి పాట” సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నారు మ‌హేశ్​ బాబు.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే నటిస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్నారు. అలాగే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పెళ్ళిసందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుందని టాక్. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

మహేష్ ఈ సినిమాలో స్పెషల్ ఏజెంట్ గా కనిపించనున్నారని టాక్. ఇందుకోసమే మహేష్ రఫ్ లుక్ లోకి మారారని అంటున్నారు. ఇక ఇటీవలే మహేష్ షర్ట్ లెస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ ఏజెంట్ పాత్ర కోసమే కండలు పెంచి బీస్ట్ లుక్ లోకి మారారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.