చైతూ నెక్స్ట్ మూవీకి టైటిల్ ఇదే?

0
121

ప్రస్తుతం యంగ్ హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మంచి కధ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాడు. ఇప్పటికే నటించిన సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం సామ్ ను పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ యంగ్ హీరో వ్యక్తిగత కారణాల చేత విడాకులు తీసుకున్నారు.

అయినా ప్రేక్షకులను అబ్బురపరచడం  కోసం తాజాగా విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా జులై 8న థియేట‌ర్ల‌లో సందడి చేయనున్న క్రమంలో  పరశురామ్‌ దర్శకత్వంలో చైతూ మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఏం టైటిల్‌ పెట్టాలని చిత్రబృందం యోచిస్తున్నారట.

ఈ సినిమాలో నాగచైతన్య మధ్య తరగతి యువకుడిగా కనిపిస్తూ ఓ ప్రముఖ కంపెనీకి సీఈఓ అయిన కథానాయికతో ఈ యంగ్ హీరో లవ్ ట్రాక్ ఎలా కొనసాగిస్తాడనే అనే అంశంపై ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్‌ను ఖరారు చేసే  బాగుంటుందని  చిత్రబృందం ఆలోచిస్తున్నారట.