తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నీ సెట్ అయితే సెప్టెంబర్ 5 నుంచి సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అయితే ఈసారి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి కంటెస్టెంట్లుగా. ఇటు సోషల్ మీడియా స్టార్లు బుల్లితెర నటులని తీసుకుంటున్నారు. అయితే ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఓ జంటని హౌస్ లోకి పంపించాలి అని చూస్తున్నారు. అయితే దానికి వారు ఒప్పుకుంటే ఇక ఫిక్స్ అయినట్లే, లేదంటే ముందే ఆ జంటని పంపిస్తారు.
ఇక ఈసారి సీజన్ లో గ్లామర్ డోస్ మరింత పెంచనున్నారట బిగ్ బాస్. అందాల తార ఇషా చావ్లా పేరు వినిపిస్తోంది. ప్రేమ కావాలి సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
2014లో వచ్చిన జంప్ జిలాని చిత్రం తర్వాత ఈ అందాల తార మరో తెలుగు సినిమాలో నటించలేదు. చివరిగా కన్నడలో వచ్చిన విరాట్ చిత్రం చేసింది ఇషా.
ఈసారి ఆమెని హౌస్ లోకి పంపించాలని చూస్తున్నారట. ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెని సంప్రదించారు అని వార్తలు వినిపించాయి. గత సీజన్లో మోనల్ గజ్జర్ను తీసుకున్న స్థానంలో ఈసారి ఇషాను తీసుకోనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా మీడియా ఈ విషయాన్ని ఇషాని అడగగా, తాను మాత్రం బిగ్బాస్ హౌజ్లో పాల్గొనడం లేదని తేల్చి చెప్పింది.