‘గాడ్ ఫాదర్’ లో ఐటెం సాంగ్..కనువిందు చేయనున్న బింబిసార బ్యూటీ

0
133
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్. మలయాళంలో తెరకెక్కిన లూసిఫర్ సినిమాకు ఇది రీమేక్. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రాజకీయ నేపథ్యంగా సాగనుంది.పాలిటిక్స్ లో ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. లేదంటే ఎదుటివారి చేతుల్లో ఓడిపోవాల్సి వస్తుంది. అయితే గాడ్ ఫాదర్ కు మాత్రం రాజకీయం చాలా తేలిక. ఇదే పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.

 

నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. నా నుండి రాజకీయం ఇంకా దూరం కాలేదంటూ మెగాస్టార్ ఓ ఆడియో బైట్ ను ఇటీవల వదిలారు. అది నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ మూవిలోదనే తెలుస్తుంది. ఇక ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షురూ చేశారు చిత్రబృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి తార్ మార్ తక్కర్ మార్ సాంగ్ రిలీజై ఆకట్టుకుంటుంది. అయితే..తాజాగా ఈ సినిమా నుంచి మరో వార్త వైరల్‌ గా మారింది. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్‌ ఉండనుందని సమాచారం. ఇందులో బింబిసార బ్యూటీ వారినా హుస్సేన్ కనువిందు చేయనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.