పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ? ఆమెకి భారీ రెమ్యునరేషన్ ?

Item song in pushpa movie-Huge remuneration for her

0
122
Pushpa 2

దర్శకుడు సుకుమార్ సినిమా అంటే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఏ హీరోతో ఆయన సినిమా చేసినా ఆ హీరో అభిమానులని ఖుషీ చేయిస్తారు. ఇక సుకుమార్ సినిమాలు అంటే కచ్చితంగా ఐటెం సాంగ్ ఉంటుంది. మరి ఇప్పుడు బన్నీతో పుష్ప చేస్తున్నారు సుకుమార్. అయితే ఇందులో ఐటెం సాంగ్ తప్పకుండా ఉంటుంది అని టాలీవుడ్ టాక్ ఇప్పటికే నడుస్తుంది.

పుష్ప సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్ణయించారు. ఈ ఏడాది ఫస్ట్ పార్ట్ రానుంది వచ్చే ఏడాది సెకండ్ పార్ట్ రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ జోష్ తో సాగే ఓ ఐటెం సాంగ్ ను రెడీ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ సారి బన్నీతో కలిసి స్టెప్పులు వేసేది ఎవరు అనే టాక్ తెగ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఎన్నో పేర్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సెక్సీ భామ సన్నీ లియోన్ పేరు వినిపిస్తోంది. ఆ పాటలో నటించడానికి 90 లక్షల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసేది ఎవరో.