జబర్దస్త్ నరేష్ వయసు ఎంతో తెలుసా

స్కిట్ లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతుంటాడు

0
118

జబర్దస్త్ ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పలు షోలు చేస్తూ సినిమాల్లో కూడా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇక అందులో ఓ నటుడి గురించి చెప్పుకోవాలి. అతనే జబర్ధస్త్ నరేష్. ఇక నరేష్ చూడటానికి మూడు అడుగుల లోపే ఉన్నా పంచులు వేశాడంటే మాములుగా ఉండదు. అతనికి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు బుల్లితెరలో.

స్కిట్ లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతుంటాడు. ఇక స్కిట్ ఒక్కసారి చదువుకుని యాక్షన్ అనగానే రంగంలోకి దిగుతాడు అది అతని టాలెంట్ .ఈ విషయాన్ని భాస్కర్ కూడా చాలా సార్లు చెప్పాడు.అయితే నరేష్ వయసు ఎంత అని సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వినిపించాయి. చాలా మంది అభిమానులు అడిగారు. అయినా ఎప్పుడు ఎక్కడా రివీల్ చేయలేదు.

వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లో అనంతపురం అనే ఊరిలో పుట్టిన నరేష్, చిన్నతనం నుండి ఎదుగుదల లోపంతో బాధపడుతున్నాడు. తాజాగా ఆయన వయసు ఎంతో తెలిసింది. 22 సంవత్సరాలు అని ఇటీవల ఓ షోలో స్కిట్ చేస్తూ చెప్పేశాడు. 22 ఏళ్లుగా జిమ్ చేస్తున్నాను అని చెప్పడంతో ఆయన వయసు బయటకు తెలిసింది. నరేష్ అన్నపూర్ణ స్టూడియో బయట తిరుగుతూ ఉంటే సునామీ సుధాకర్ చంటి టీమ్ లో జాయిన్ చేసాడు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి వచ్చి మంచి పేరు తెచ్చుకున్నాడు.