జబర్దస్త్ కు అవినాష్ గుడ్ బై చెప్పేశాడా ?

జబర్దస్త్ కు అవినాష్ గుడ్ బై చెప్పేశాడా ?

0
114

బిగ్ బాస్ హౌస్ లో ఈసారి చాలా మంది కొత్త వారిని తీసుకువచ్చారు, సోషల్ మీడియా సెలబ్రెటీలకి అవకాశం ఇచ్చారు….. అయితే ఈసారి మరింత సరికొత్తగా టాస్కులు ఆట ఉంది, అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి వచ్చిన ముగ్గురిలో జబర్ధస్త్ అవినాష్ బాగా ఆడుతూ ఇంటిలో కొనసాగుతున్నాడు.

అయితే అతను జబర్ధస్త్ లో ఎంతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు, అలాంటి అవినాష్ జబర్దస్త్ లాంటి టాప్ రేటింగ్ షో వదిలేసి ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, అయితే అవినాష్ ఇలా ఎంట్రీ ఇవ్వడంతో ఇక జబర్ధస్త్ కి అతను గుడ్ బై చెప్పాడా అని అందరూ అనుకున్నారు.

తాజాగా నామినేషన్ ప్రక్రియ తర్వాత అవినాష్ బాధపడుతూ ఓ మాట అన్నాడు, ఇక పాత షో వారు కూడా నన్ను పంపించేశారు, ఇక నాకు అక్కడ ఛాన్స్ లేదు అనే మాట అన్నాడు, ఈ సమయంలో అవినాష్ ని అరియానా సోహెల్ కూడా ఓదార్చారు, అయితే అతనికి టాలెంట్ ఉంది.. అది కాకపోతే వేరే షోలో నీకు అవకాశంం వస్తుంది అని అతని అభిమానులు అంటున్నారు.