బిగ్ బాస్-3 : వరుణ్ సందేశ్ కు జాఫర్ వార్నింగ్.!

బిగ్ బాస్-3 : వరుణ్ సందేశ్ కు జాఫర్ వార్నింగ్.!

0
90

మొదటివారం సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 3 రెండో వారం చివరికి చేరుకుంది. మొదటివారంలో హేమ ఎలిమినేట్ అవ్వగా ఆమె స్థానంలో వైల్డ్ కార్డు ఎంట్రీగా ట్రాన్సజెండర్ తమన్నా సింహాద్రి వచ్చారు. ఇక ఆ తరువాత గొడవలతో, సరదాలతో సాగిపోతోంది బిగ్ బాస్. రెండవ వారం నామినేషన్‌లో వరుణ్ సందేశ్‌, వితికా, శ్రీముఖి, హిమజ, జాఫర్‌, మహేష్‌, పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ ఎలిమినేషన్ ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది. ముందుగా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తమకు నచ్చిన వారికి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టారు. అందరూ ఊహించినట్టుగానే జాఫర్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ సారి ఈ ప్రాసెస్ చాలా ఎమోషనల్ గా సాగింది. జాఫర్ వెళ్ళిపోతుంటే హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఎక్కువగా బాబా భాస్కర్ తో కనిపించే జాఫర్ ఇంట్లోని మిగతా వాళ్ళతో కూడా స్నేహంగా ఉన్నాడు. అయితే జాఫర్ వెళ్ళిపోతూ ఆఖరి క్షణంలో వరుణ్ సందేశ్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. బాబా భాస్కర్ ని ఏమీ అనొద్దు అని చెప్తూ ఒక చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య ఏం జరిగిందా ? అని ఆలోచిస్తున్నారు ప్రేక్షకులు. మొన్నటి ఎపిసోడ్ లో వితికాని ఉద్దేశిస్తూ బాబా భాస్కర్ వరుణ్ ని రెచ్చగొడుతుందని అనడం వల్ల ఏమైనా గొడవ జరిగిందా? లేక బాబా భాస్కర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని వరుణ్ పదే పదే చెప్పడంతో అలా మాట్లాడాడా ? అనేది తెలియదు. లేదంటే ఇంట్లో జరిగిన ఏదైనా గొడవను టెలికాస్ట్ కాకుండా చేశారా ? అనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతోంది.