తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 1990 హీరో జగపతి బాబు ఇప్పుడు తన సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశారు.. యువ స్టార్ హీరోల చిత్రాలకు విలన్ పాత్రలు అలాగే తండ్రి పాత్రలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యాడు… జగ్గుభాయ్ సెకెండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇరగదీస్తున్నాడు…
ప్రస్తుతం ఆయనకు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి… ఇది ఇలా ఉంటే జగపతి బాబు గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… జగపతి బాబు విజయశాంతి కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది…
ఈ సినిమాలో విజయశాంతి జగపతి బాబు భార్య భర్తలుగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి… ఈ చిత్రాన్ని ఒక తమిళ్ దర్శకుడు ముందుకు నడిపించే ఆలోచనలో ఉన్నాడని టాక్ వినిపిస్తోంది… దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తి అయినట్లు వార్తలు వస్తున్నాయి… అయితే ప్రస్తుతం జగపతి బాబు ఖాళీగాలేరు వరుసగా మూడు సినిమాల్లో నటిస్తున్నారు…