జై భీమ్: రియల్ సినతల్లికి అండగా హీరో సూర్య

0
95

తమిళ స్టార్ హీరో  సూర్య నటించిన ‘జై భీమ్’ చిత్రం నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. టిజే జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జై భీమ్‌’లో గిరిజనులపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా తెరకెక్కింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఈ సినిమాలో సూర్య.. నిజ జీవితంలో పార్వతికి సహాయం చేసిన న్యాయవాది చంద్రు పాత్రలో నటించి మెప్పించారు. 28 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ కథ ఆధారంగా రూపొందిన ‘జై భీమ్’ సినిమా అందరి మనసులను కదిలించిన ‘చినతల్లి’ పాత్ర అసలు పేరు పార్వతి. ఆమె ఇప్పటికీ సరైన ఇల్లు లేకుండా చిన్న గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య పార్వతికి సహాయం చేయడానికి 10 లక్షల రూపాయల బ్యాంకు డిపాజిట్ చేస్తానని చెప్పారు.

నటుడు సూర్య మంగళవారం చెన్నైలో రాజకన్ను భార్య పార్వతిని స్వయంగా కలిసి రూ.15 లక్షల చెక్కును అందజేశారు. తన తరపున రూ.10 లక్షలు, తన చిత్ర నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్ తరపున రూ.5 లక్షలు విరాళంగా అందించారు. అయితే సినిమాలో తమ వర్గాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయమని వన్నియర్ వర్గం.. సూర్యకు ఇటీవల లీగల్​ నోటీసులు పంపింది. దీనిపై అభిమానుల నుంచి సూర్యకు భారీగా మద్దతు లభిస్తోంది.