టాలీవుడ్ లో లవ్ లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది జెనీలియా , అయితే సినిమాలు చేస్తూనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ సమయంలో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకుంది, వీరిది ప్రేమ పెళ్లి అనేది చాలా మందికి తెలుసు, ఇక రితేష్ ది రాజకీయంగా పెద్ద ఫ్యామిలీ. తండ్రి కూడా ముఖ్యమంత్రిగా చేశారు.
తాజాగా 41వ పుట్టిన రోజు చేసుకున్నారు రితేష్.. 16 ఏళ్ల క్రితం తుఝె మేరీ కసమ్ సినిమాతో రితేష్ బాలీవుడ్‌లో కాలుమోపారు. ఫ్యామిలీమ్యాన్ తరహా పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తన తొలి సినిమాలో జెనీలియాను హైదరాబాద్‌లో కలుసుకున్నారు రితేష్ ..ఆ సమయంలో అతనికి ఆమెపై ప్రేమ చిగురించింది.
సినిమాలో నటిస్తున్న హీరో ముఖ్యమంత్రి కొడుకు అని తెలుసుకున్నజెనీలియా మొదట్లో రితేష్ విషయంలో అంటీముట్టనట్లు ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేసరికి జెనీలియా రితేష్‌ను అర్థం చేసుకున్నారు. తర్వాత మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు ప్రేమ లోతులో మునిగిపోయారు.2012, ఫిబ్రవరి 3న వివాహం చేసుకున్నారు. 2014లో వారికి కుమారుడు జన్మించాడు. అలా తన లవ్ స్టోరీ చెప్పాడు రితేష్.