జ‌న‌వ‌రి 22న బాల‌య్య మ‌రో ముహూర్తం

జ‌న‌వ‌రి 22న బాల‌య్య మ‌రో ముహూర్తం

0
88

రూల‌ర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాల‌య్య త‌న లుక్ మార్చి కొత్త సినిమా కోసం క‌స‌ర‌త్తులు చేస్తున్నారు, అవును తాజాగా హిట్ కాంబోలో బాల‌య్య బోయ‌పాటి సినిమా రాబోతోంది. ఈ సినిమా ప‌నులు చ‌క‌చ‌క జ‌రుగుతున్నాయి.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమా జనవరి 22న నుండి మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను మెయిన్ విలన్ గా, సోనాక్షి సిన్హాని హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట‌, ముంబై వెళ్లి బోయ‌పాటి చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు అని తెలుస్తోంది.

త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అంటున్నారు.. ఇక సినిమాలో మ‌రో అప్ డేట్ ఇందులో రెండో హీరోయిన్ గా కే థరీన్ థెరీసాని తీసుకోనున్నారట. అలాగే మరో అతిధి పాత్రలో హీరోయిన్ వేదిక కూడా కనిపించనుంది.అలాగే హీరో శ్రీకాంత్ మరో నెగటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. సింహా లెజెండ్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం పై ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు.