జాతిరత్నాలు సినిమా హీరోయిన్ కి మరో క్రేజీ ఆఫర్

Jathi Ratnalu Movie Heroine Got crazy offer

0
106

జాతిరత్నాలు సినిమాలో చిట్టీ నటన ఎంతో అద్భుతంగా ఉంది. ఆమెకి మంచి పేరు వచ్చింది ఈ చిత్రంలో నటనతో. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన ఫారియా అబ్దుల్లా కి టాలీవుడ్ లో ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఈ అందాల భామ నటన యువతకు బాగా నచ్చింది. అంతేకాదు మంచి కామెడీ టైమింగ్ కూడా జాతిరత్నాలు చిత్రంలో చిట్టీ చూపించింది.

తాజాగా ఆమెకి ఓ మంచి ఆఫర్ వచ్చిందట. మంచు వారి అబ్బాయి చిత్రం లో నటించనుందట మన చిట్టీ. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్లో తెరకెక్కతున్న చిత్రం ఢీ2. ఈ సినిమాలో విష్ణు సరసన ఫారియా అబ్దుల్లా హీరోయిన్ గా ఫిక్స్ అయ్యారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే టాలీవుడ్ లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. మొత్తానికి ఢీ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఇక ఢీ 2 మరింత అద్భుతంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. విష్ణు, జెనీలియా కెమెస్ట్రీ సూపర్ గా ఉంటుంది ఈ సినిమాలో. అంతేకాదు బ్రహ్మీ కామెడీ సినిమాకి హైలెట్. ఇక ఈసారి ఢీ 2 ఎలా ఉంటుందో చూడాలి.