జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రియల్ స్టోరీ

జాతిరత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా రియల్ స్టోరీ

0
92

ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయింది.. ఇందులో అందరి నటనకు ప్రశంసలు వచ్చాయి, ఇక ఈసినిమాలో నటించిన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కు ఎంతో ఫేమ్ వచ్చింది, ఇక ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఇదే ఆమెకు తొలిసినిమా ఈ సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు.

 

తొలి సినిమా అయినా ఎంతో బాగా నటించిందని అందరూ మెచ్చుకున్నారు.. ఇక తాజాగా ఆమె అఖిల్ సినిమాలో కూడా నటిస్తోందట. ఇక ఆమె హైదరాబాద్ అమ్మాయి ఆమె రియల్ స్టోరీ చూద్దాం…1998మే 28న సంజయ్ అబ్దుల్లా, కౌశ సుల్తాన్ దంపతులకు జన్మించింది ఫరియా అబ్దుల్లా.. ఆమెకి ఓ సిస్టర్ ఉన్నారు, ఇక ఆమె విద్యాభ్యాసం హైదరాబాద్ లో జరిగింది…సికింద్రాబాద్ లోని కాలేజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసింది. ఇక ఆమె స్కూల్ డేస్ నుంచి నాట్యం అంటే ఇష్టం ఉండటంతో డ్యాన్స్ నేర్చుకుంది, అనేక షోలలో పార్టిసిపేట్ చేసింది మంచి పెయింటర్ కూడా.

 

తర్వాత పలు మీడియా సంస్థల్లో పనిచేసిన ఈమె పలు వెబ్ సిరీస్ లో నటించింది…నాగ అశ్విన్ ఓ ఫంక్షన్ కి వచ్చినపుడు తన వెబ్ సిరీస్ గురించి ఫరియా అబ్దుల్లా చెప్పింది.. ఇక జాతిరత్నాలు సినిమా చేస్తున్న సమయంలో ఆమెకి అవకాశం ఇచ్చారు, ఇలా ఆమె మంచి నటిగా గుర్తింపు పొందింది.