జాతిరత్నాలు సీక్వెల్ స్టోరీ లైన్ ఇదేనా – టాలీవుడ్ టాక్

జాతిరత్నాలు సీక్వెల్ స్టోరీ లైన్ ఇదేనా - టాలీవుడ్ టాక్

0
101

ఈ ఏడాది అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం జాతిరత్నాలు సూపర్ హిట్ అయింది, అంతేకాదు మంచి వసూళ్లు వచ్చాయి, సినిమాకి మంచి టాక్ రావడం వసూళ్లు రావడంతో ఇక నవీన్ పొలిశెట్టికి మంచి అవకాశాలు వస్తున్నాయి.. అంతేకాదు చాలా మంది దర్శకులు కథలు చెబుతున్నారు, ఇక ఈ సినిమాలో నటించిన

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శికి మంచి రోల్స్ వచ్చాయి.

 

ఇక సినిమా చూసిన ప్రతీ ఒక్కరు వీరి ముగ్గురిని ఎంతో ప్రశంసిస్తున్నారు, ఇక దర్శకుడు అనుదీప్ కు మంచి ఫేమ్ వచ్చింది, అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని అంటున్నారు.. మరి ఈ సీక్వెల్ ఎలా ఉంటుంది అనే చర్చ అందరిలో జరుగుతుంది అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల బట్టీ చూస్తుంటే.

 

జాతిరత్నాలు చిత్రంలో జోగిపేట నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చాక జరిగిన ముగ్గురి కథను చూపించాడు దర్శకుడు.. ఇప్పుడు ఆ ముగ్గురు జాబ్ కోసం అమెరికా వెళితే ఎలా ఉంటుందో అనే కామెడీతో సినిమా చేయాలి అని చూస్తున్నారు. ఇక చిట్టి ఫరియా నటన కూడా అందరికి నచ్చింది, చూడాలి దీనిపై ఎప్పుడు ప్రకటన ఉంటుందో.