జయమ్మ పంచాయతీ ట్రైలర్ రిలీజ్

0
89

యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో యాంకర్ సుమకు ఉన్న అభిమానులు మరెవ్వరికీ లేరు. యాంకర్ గానే కాకుండా..సినిమాల్లోనూ భిన్న పాత్రలు చేసే మనందరని ఆకట్టుకుంది. తాజాగా విజయ్‌ కుమార్‌ కలివరపు దర్శకత్వంలో ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం జయమ్మ పంచాయతీ.

ఈ చిత్రాన్ని బలగ ప్రకాశ్‌ నిర్మించాడు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో..ఎవరికీ, దేనికీ లొంగని ధైర్యవంతురాలిగా, పల్లెటూరి మహిళగా యాంకర్  సుమ నటించారు. అయితే సుమ అభిమానులు ఆనంద పడే విషయం తెలియజేసింది చిత్రబృందం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. మనందరికీ ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సినిమా మే 6న విడుదల కానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

వీడియో చూడాలనుకుంటే ఈ కింది లింక్ ఓపెన్ చేయండి..

https://youtu.be/iycJ-_VCHm8