ఎవరైనా ఆయన తో చేశాకే..జయసుధ..!!

ఎవరైనా ఆయన తో చేశాకే..జయసుధ..!!

0
135

ఇప్పటి రోజుల్లో ప్రతి సినిమాలో కొత్త హిరోయిన్లను ఎక్కువగా దర్శకులు పరిచయం చేస్తున్నారు. అయితే వారి పక్కన ఎవరైన కథానాయకుడిలా నటిస్తున్నారు. కానీ గతంలో ఒక్కరి పక్కన అవకాశం వచ్చేది అంటూ జయసుధ ఓ సెంటిమెంట్ గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్న సెంటిమెంట్లు ఏ పరిశ్రమలోనూ ఉండవన్నారు. జయసుధ, జయప్రద మొదలుకొని చాలా మంది హీరోయిన్ల మొదటి సినిమా కచ్చితంగా ఆ హీరోతో నే ఉండేదట. అప్పట్లో అదో సెంటిమెంట్ గా మారిందట.

ఇంతకీ ఆ హీరో ఎవరంటే… ఆయనే చంద్రమోహన్.అందుకు కారణం కూడా జయసుధ వివరించారు. అప్పట్లో మహిళా పాత్రలు ప్రధాన పాత్రలుగా చాలా సినిమాలు వచ్చేవట. లీడ్ పాత్రల్లో హీరోయిన్ ఉంటే ఇక హీరోకు అంతగా గుర్తింపు ఉండదు కదా. అందుకే అలాంటి సినిమాల్లో పెద్ద హీరోలెవరూ చేసేవారు కాదట. అలాంటి సినిమాలకు చంద్రమోహన్ పెద్ది దిక్కుగా ఉండేవారట. అందువల్ల చాలా సినిమాల్లో చంద్రమోహన్ హీరోగా నటించేవారట. అందులో కొత్త హీరోయిన్ అయితే ఇక ఆ సినిమాలో హీరో కచ్చితంగా చంద్రమోహనే అయ్యేవాట.