జె. డి.చక్రవర్తి రియల్ స్టోరీ

జె. డి.చక్రవర్తి రియల్ స్టోరీ

0
264

జె. డి. చక్రవర్తి మంచి నటుడు అంతేకాదు మంచి దర్శకుడు కూడా, ఆయనని అందరూ గడ్డం చక్రవర్తి అని కూడా అంటారు, ఆయన అసలు పేరు నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మ మొదటి చిత్రం శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు…శివ నుంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

తెలుగు తమిళ హిందీ భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ప్రతినాయకుడిగా, సహనటుడిగా నటించాడు. తర్వాత హీరోగా మంచి సినిమాలు చేశారు…హైదరాబాదు లోని తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో కర్ణాటక సంగీత విద్వాంసురాలైన డాక్టర్ శాంత కోవెల నాగులపాటి, నాగులపాటి సూర్యనారాయణ దంపతులకు జన్మించారు ఆయన. వారిది రాజమండ్రి ప్రాంతం.

హైదరాబాదు లోని సెయింట్ జార్జ్స్ గ్రామర్ పాఠశాల లో ప్రైమరీ విద్య చదివారు.. తర్వాత ఇంజనీరింగ్ విద్యను చైతన్య భారతి కళాశాల లో పూర్తి చేశాడు..1989 లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడుగా జె. డి. పాత్రను పోషించడంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు, వన్ బై టూ, మనీ మనీ, గులాబీ ,మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా చిత్రాలతో సూపర్ సక్సెస్ అందుకున్న కథానాయకుడు అయ్యారు.

హోమం
సిద్ధం
మనీ మనీ మోర్ మనీ
ఆల్ ది బెస్ట్ – ఈ సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు.