జీవితంలో మళ్లీ ఆ తప్పు చేయను చిరుముందు బండ్ల గణేష్ ప్రామిస్

జీవితంలో మళ్లీ ఆ తప్పు చేయను చిరుముందు బండ్ల గణేష్ ప్రామిస్

0
98

సరదా సంభాషణ అంటే నిర్మాత బండ్లగణేష్ అని అందరూ అంటారు.తాజాగా హైదరాబాద్ లో జరిగిన సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఆసక్తికర ప్రసంగంతో మెగాస్టార్ చిరంజీవిని కూడా నవ్వించాడు.
సంస్కారం అంటే మెగాస్టార్ మన అన్న చిరంజీవి అంటూ ఆయన ప్రారంభించారు. ఓ మెగాస్టార్ అయ్యుండి మరో సూపర్ స్టార్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చిన ఆయన సంస్కారానికి తన పాదాభివందనం అంటూ మాట్లాడాడు.

మీరు వందేళ్లు చల్లగా ఉండాలి సార్, మీరు ఇండస్ట్రీలోకి వచ్చి 43 ఏళ్లు. మీరు మరో 20 ఏళ్లు ఇండస్డ్రీలో అందరినీ అలరించాలి. ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు. మహేశ్ బాబు పక్కన మిమ్మల్ని చూస్తుంటే మీ ఇద్దరూ అన్నదమ్ములుగా యాక్ట్ చేయాలనిపిస్తోంది సార్ అని అన్నారు, దీంతో ఇరువురి అభిమానులు చప్పట్లతో ఈలలతో కేరింతలు కొట్టారు.

మెగాస్టార్ చిరంజీవి గారు మళ్లీ నటించాలని నేను మొక్కని దేవుడంటూ లేరు. కానీ నాకు ఒక్క సినిమా కూడా చెయ్యకుండా అన్నీ వాళ్లబ్బాయికే చేస్తున్నారు అంటూ చమత్కరించారు.అంతేకాదు, తనను బ్లేడ్ గణేశ్ అని పిలవొద్దని, దయచేసి బండ్ల గణేశ్ అనే పిలవాలని అందరికీ విజ్ఞప్తి చేశారు.తెలిసోతెలియకో నోరుజారానని అందరూ వెర్రిపప్పను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు, ఇక రాజకీయాల్లోకి వెళ్లేది లేదు అని చెప్పకనే చెప్పారు ఆయన… అమ్మతోడు ఇక సినిమాలే చేస్తాను అని చెప్పారు గణేష్.