జెనీలియా మళ్లీ వచ్చేస్తోంది ఏ సినిమా అంటే

జెనీలియా మళ్లీ వచ్చేస్తోంది ఏ సినిమా అంటే

0
93

జెనీలియా డిసౌజా తెలుగు హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ ..చక్కగా పెళ్లి చేసుకుని ఓ ఇల్లాలు అయింది.. దాదాపు పదేళ్ల కిందట జెనీలియా కెరీర్ తెలుగునాట పీక్ స్టేజ్ ను చూసింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో మెరిసిన తర్వాత స్టార్ హీరోయిన్ అయింది. తర్వాత అన్నీ హిట్ సినిమాలు చేసింది.

ఇక పెద్దగా ఎక్స్ పోజింగ్ కూడా చేయకుండా నటన లో క్యూట్ నెస్ తో తనకంటూ యూత్ ఫాలోవర్స్ ని పెంచుకుంది ఈ అందాల భామ…మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఇంటి కోడలయ్యింది. జెనీలియా కుటుంబ సభ్యులు రాజకీయంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

ఇక ఆమె భర్త అన్నదమ్ములు ఇద్దరూ ఎమ్మెల్యేలు అయ్యారు, ఇక జెనీలియా తాజాగా రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో పెళ్లైన హీరోయిన్లు రాణిస్తూ ఉన్నారు. ఐశ్వర్య, దీపికా, ప్రియాంక.. ఇలా పెళ్లైన హీరోయిన్ల రాజ్యం నడుస్తోంది. అందుకే ఆమె కూడా తాజాగా మళ్లీ మేకప్ వేసుకోని నటించాలి అని అనుకుంటోందట. అందుకే ఈ మధ్య ఫోటోషూట్లకు సమయం కేటాయిస్తోంది.