తారక్ సినిమాలో శ్రీదేవి కూతురు మ‌రో హీరోయిన్ ఎవ‌రంటే

తారక్ సినిమాలో శ్రీదేవి కూతురు మ‌రో హీరోయిన్ ఎవ‌రంటే

0
91

రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ జ‌క్క‌న్న చిత్రం ఆర్ ఆర్ ఆర్, అయితే ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ నిలిచిపోయింది, మ‌రో రెండు నెల‌లు ఈ కోవిడ్ కేసులు త‌గ్గేవ‌ర‌కూ షూటింగ్ కు బ్రేకులు ఇచ్చారు, అయితే త‌ర్వాత తార‌క్ త్రివిక్ర‌మ్ తో సినిమా చేయ‌నున్నారు.

ఈ చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు కావచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకి రాజ‌కీయ త‌ర‌హాలో ఉంటుంది అంటున్నారు, ఇక ఇందులో పొలిటిక‌ల్ లీడ‌ర్ గా తార‌క్ క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో తార‌క్ స‌ర‌సన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలుస్తోంది. పూజా హెగ్డే, రష్మిక, సమంత ఈ ముగ్గురిలో ఒకర్ని ఎంపిక చేయనున్నారని సమాచారం. ఇక మ‌రో హీరోయిన్ గా జాన్వీక‌పూర్ పేరు తెరపైకి వ‌చ్చింది. ఈ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.