నాగ్ ని బిట్టు అని పిలవడానికి కారణం అదే సంచలన విషయం చెప్పిన సుజాత

నాగ్ ని బిట్టు అని పిలవడానికి కారణం అదే సంచలన విషయం చెప్పిన సుజాత

0
106

బిగ్ బాస్ రియాలిటీ షో ఈసారి సీజన్ 4 తెలుగులో చాలా రసవత్తరంగా సాగుతోంది. ఆటలు టాస్కులు రిలేషన్లు ఫ్రెండ్స్ ఇలా మస్తు ఎంజాయ్ చేస్తున్నారు అభిమానులు, ఇక ఎవరి ఫ్యాన్స్ వారికి సోషల్ మీడియాలో మద్దతు ఇస్తున్నారు, అంతేకాదు పలు పోల్స్ ప్రకారం ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారు అనేది కూడా ముందుగానే బయటకు వస్తున్నాయి.

నాలుగో సీజన్ కి నాగార్జుననే హోస్ట్ గా ఉన్నారు . అయితే ఈ సీజన్లో నాగార్జునని సుజాత బిట్టు అని పిలవడం ఆయన అభిమానులకు అస్సలు మింగుడు పడలేదు. నాగ్ అభిమానులు ఎలాగైనా ఆమెని హౌస్ నుంచి బయటకు పంపాలి అని అనుకున్నారు, చివరకు ఆమె ఎలిమినేట్ అయింది గత వారం.

బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్ సుజాత బిగ్ బాస్ హౌజ్కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలు వెల్లడించింది. తాను నాగార్జునని బిట్టు అని పిలవడానికి గల కారణం కూడా చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ టీం నన్ను నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు, ఈ సమయంలో అవును అని చెప్పాను.

మనం సినిమాలో ఆయన చేసిన బిట్టు పాత్ర మరింత ఇష్టమని చెప్పాను. ఆయనను బిట్టు అని పిలవడం మీకు ఇష్టమా అని వారు అడిగారు, అవును అన్నాను, ఆయన అనుమతి తీసుకుని నేను పిలిచాను అని ఆమె చెప్పింది. ఒకవేళ ఆ పిలుపు వారికి నచ్చకపోతే నన్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి వద్దని చెప్పేవాళ్లు. అయితే ఇది ఆయన అభిమానులకు బాధ కలిగిస్తే క్షమించండి. నేను కావాలని మాత్రం పిలవలేదు అని తెలిపింది.