అట్లీతో సినిమాపై ఎన్‌టీఆర్ క్లారిటీ.. లైన్ అదే..

-

జూనియర్ ఎన్‌టీఆర్(Jr NTR) ప్రస్తుతం తన సరికొత్త సినిమా ‘దేవర’ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ముంబైలో జోరుగా ప్రచారం చేస్తున్నాడు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ సినిమాలపై కూడా ఎన్‌టీఆర్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. అట్లీతో సినిమా గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. తాను, అట్లీ కాంబోలో రావాల్సిన కొన్ని కారణాల వల్లే ఆలస్యమవుతోందని, దానికి కూడా తానే కారణమని చెప్పాడు ఎన్‌టీఆర్. కానీ వీలైనంత త్వరగా అట్లీతో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పాడు. అట్లీతో ముందుగా మరో ప్రముఖ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నట్లు ఎన్‌టీ ఆర్ చెప్పాడు. అతడే ప్రశాంత్ నీల్. కేజీఎఫ్, సలార్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రశాంత్ నీల్.. ఎన్‌టీఆర్ కోసం కూడా అద్భుతమైన స్టోరీ రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం కథ తుదిమెరుగులు అద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా అట్లీతో సినిమా గురించి ఎన్‌టీఆర్ ఏమన్నాడంటే..

- Advertisement -

‘‘అట్లీ(Atlee) చాలా టాలెంటెడ్. అతను నాకు ఓ ఇంట్రస్టింట్, సూపర రొమాంటిక్ కామెడీ స్టోరీ లైన్ చెప్పాడు. దీని గురించి చర్చించుకున్నాం. చేయాలని కూడా అనుకున్నాం. కానీ ఇద్దరం కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాం. అందువల్లే మా కాంబో మూవీ పట్టాలెక్కలేదు. కానీ కాస్తంత లేట్ అయినా అట్లీతో సినిమా చేసి తీరతా. అట్లీ తీసిన ‘రాజా రాణి’ నాకు చాలా ఫేవరెట్. అలాంటి అట్లీతో చేసే అవకాశాన్ని వదులుకోను. వీలైనంత త్వరగానే అట్లీతో మూవీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తాం’’ అని ఎన్‌టీార్ కీ అప్‌డేట్ ఇచ్చేశాడు. మరి ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాలి. దీంతో పాటుగా దేవర తర్వాత ఎన్‌టీఆర్(Jr NTR).. ప్రశాంత్ నీల్ సినిమాను కంప్లీట్ చేయనున్నాడు.

Read Also: మహిళా కమిషన్‌కు చేరిన జానీ మాస్టర్ కేసు..
Follow Us On: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...