తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ ముద్ర చెరపలేనిది అని చెప్పాలి, ఇక మూడో తరంగా ఎన్టీఆర్ కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్ కల్యాణ్ రామ్ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు, అయితే ఓ సినిమా కారణంగా అన్నయ్య కళ్యాణ్ రామ్ తమ్ముడు తారక్ మధ్య కొత్త చిక్కులు వచ్చి పడ్డాయట.
తారక్ ప్రస్తుతం రాజమౌళితో కలిసి 29 వ సినిమా చేస్తున్నారు.. ఇక తర్వాత 30 వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నారు…అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ తో సినిమా తీస్తున్నారు.. నిజానికి తారక్ తన 30వ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేయాల్సి ఉంది.
ఇక 30 వ సినిమా హరికా హసిని క్రియేషన్స్ చేస్తోంది. అయితే 30 వ సినిమా ఆయనతో ఇక చేయరు అని తెలుస్తోంది ..కల్యాణ్ రామ్ తో 31 వ సినిమా చేసే అవకాశం ఉంది అని తెలుస్తోంది.. సో ఈ సినిమా కి ఇంకా రెండు సంవత్సరాల సమయం పడుతుంది అంటున్నారు.