జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రో మంచి ప‌ని చేశారు మ‌న‌సున్న మారాజు

జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌రో మంచి ప‌ని చేశారు మ‌న‌సున్న మారాజు

0
109

నంద‌మూరి కుటుంబంలో బాల‌య్య ,జూనియ‌ర్ ఎన్టీఆర్ ,క‌ల్యాణ్ రామ్, ఇలా వ‌రుస‌గా హీరోలు సినిమాలు చేసి అభిమానుల‌ని అల‌రిస్తున్నారు. త‌మ అభిమానుల కోసం ఏమైనా చేస్తారు ఈ హీరోలు, ఇక సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా నంద‌మూరి కుటుంబం ఎప్పుడూ ముందు ఉంటుంది, ఇక జూనియర్ఎన్టీఆర్ కూడా లాక్ డౌన్ వేళ త‌న‌కు తోచిన విధంగా సాయం అంద‌చేస్తున్నారు.

సీసీసీకి సాయం అందించారు, అలాగే సినిమా ప‌రిశ్ర‌మ‌లో పేద క‌ళాకారుల‌ని ఆదుకుంటున్నారు, ఇక నిత్య‌వ‌స‌రాలు కావల‌సిన వారికి ఆయ‌న అందిస్తున్నారు, ఇక బ‌య‌ట‌కు తెలియ‌కుండా న‌గ‌దు సాయం కూడా చాలా మందికి చేస్తూ ఉంటారు.

ఇక తాజాగా ఆయ‌న ద‌గ్గ‌ర ప‌ని చేసే స్టాఫ్ కి ఇప్పుడు, ప‌ని లేక‌పోయినా ఆయ‌న అంద‌రిని ఇంటికి పంపించేసి, కుటుంబాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండండి అని చెబుతున్నార‌ట‌,అంతేకాదు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఒక‌టో తేదిన శాల‌రీ ఇస్తున్నారు, అడ్వాన్స్ శాల‌రీ కూడా ఇస్తున్నారు, ఏదైనా ఆర్ధిక ఇబ్బంది ఉంటే త‌న‌తో చెప్పండి అని చెప్పార‌ట‌, ఇక తారక్ చేసిన ప‌ని ఇప్పుడు టాలీవుడ్ లో పెను వార్త‌గా వైర‌ల్ అయింది, నిజంగా తారక్ మంచి మ‌న‌సుకి అంద‌రూ అభినందిస్తున్నారు.