యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం నలుగురు స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్….

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం నలుగురు స్టార్ డైరెక్టర్లు వెయిటింగ్....

0
97

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నాడు… ఈచిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో సినిమా చేయనున్నాడు… వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సమేత చిత్రంబ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే… దాని తర్వాత ఇప్పుడు మరో చిత్రం రానుంది వీరిద్దరి కాంబినేషన్ లో…

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యేది అలాగే త్రివిక్రమ్ సినిమాకూడా సెట్స్ పైకి వెళ్లేది కరోనా కారణంగా డేట్స్ అన్ని తారుమారు అయ్యాయి… అయితే త్రివిక్రమ్ తో మూవీ కంటే ఎన్టీఆర్ తమిళ దర్శకుడు అట్లీతో ఒక మూవీ తీయనున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి…

ఇప్పటికీ ఈ మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి… అట్లీ కూడా ఎన్టీఆర్ తో ఒక యాక్షన్ మూవీ చేయాలని చెప్పకనే చెప్పకొచ్చాడు.. ఇక కేజీఎఫ్ డైరెక్టర్ కూడా ఎన్టీఆర్ తో ఒక సినిమా తీయనున్నాడని వార్తల వస్తున్నాయి.. తాజాగా మరో దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా తీసేందుకు సిద్దమయ్యారట…మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కూడా ఎన్టీఆర్ ఒక చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.. ప్రభాస్ మూవీ తర్వాత నాగ్ అశ్విన్ ఎన్టీఆర్ మూవీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు…