ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్టేట్స్….. ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్

ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఇంట్రెస్టింగ్ అప్టేట్స్..... ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్

0
108

అలా వైకుంఠపురంలో సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు… వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే… ఇక త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రంలో ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా చూపించే అవకాశాలు ఉన్నాయి..

ఎన్టీఆర్ ను రాజకీయ నాయకుడు తరహాలో చూపించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది… ఇది ఇలా ఉండగా ఈ చిత్రం గురించి తాజా అప్ డేట్స్ ఇలా ఉన్నాయి.. ఎన్టీఆర్ కు సరసనగా పూజా హెగ్దే అలియా భట్ నటిస్తోన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి… త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేతలో కూడా పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది…

ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే మరో చిత్రంలో కూడా ఈ ముద్దుగుమ్మతో పాటు అలియా భట్ కూడా హీరోయిన్ గా నటిస్తోందని ఇండస్ట్రీలో టాక్… కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు… మే నుంచి త్రివిక్రమ్ కు డేట్లు ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది… ఈ లోపు త్రివిక్రమ్ స్క్రిఫ్ట్ వర్క్ ను పూర్తి చేసి షూటింగ్ కు రెడీ అవుతున్నాడు..