Junior NTR |దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు పొందింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల నటనకు హాలీవుడ్ దర్శకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్‌లో నాటు నాటు పాటకు వచ్చిన స్పందన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉందంటే ఆ పాట ఎంత క్రేజ్ సంపాదించిందో తెలుస్తోంది. తాజాగా.. ఈ పాటపై జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాటు నాటు పాటకు ఆస్కార్ తప్పక వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆస్కార్ పొందిన ఆ క్షణం యావత్ భారతదేశం మొత్తం ఆ రెడ్ కార్పెట్‌పై నడుస్తుందని కొనియాడారు. ఆస్కార్ వేడుకల్లో పాల్గొంటున్నప్పుడు మా గుండెల్లో మా దేశాన్ని మోస్తున్నట్లే భావిస్తాం. అందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. అంటూ పలు విషయాలు వెల్లడించాడు.
ఆ క్షణం మా గుండెల్లో మా దేశాన్ని మోస్తున్నట్లే భావిస్తాం: NTR
-