జూనియర్ ఎన్టీఆర్ ని ఖుష్బు ఏమన్నారో తెలుసా

జూనియర్ ఎన్టీఆర్ ని ఖుష్బు ఏమన్నారో తెలుసా

0
88

తారక్ అంటే మన జూనియర్ ఎన్టీఆర్ అనేది తెలిసిందే.. ఆయన నటనకి ఎవరైనా ఫిదా అవ్వుతారు అనేది తెలిసిందే, అయితే ఆయన నటనకు బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు.. డ్యాన్స్ విషయంలో టాలీవుడ్ లో తారక్ తర్వాతే ఎవరైనా అని అంటారు .. నందమూరి వారసుడిగా టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ తాత ఎన్టీరామారావు కి తగ్గ మనవడిగా నిరూపించుకున్నాడు.

పాత్ర ఎదైనా… సన్నివేశం ఎదైనా తారక్ ప్రతిభకు లొంగాల్సిందే. ఈజీగా ఏ పాత్ర అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు..తాజాగా తారక్ పై సీనియర్ హీరోయిన్ ఖుష్బు షో లో తారక్ ఫోటో చూడగానే ముద్దుల వర్షం కురిపించి హాట్ టాపిక్ గా మారింది.అలీతో జాలీగా షోలో ఖుష్బు పార్టిసిపేట్ చేశారు, తనకు తారక్ నటన డ్యాన్సులు అంటే ఇష్టం అని ఆమె చెప్పారు.. గతంలో ఆమె జూనియర్ తారక్ తో కలిసి యమదొంగ సినిమాలో నటించారు. ఆరోజుల్లో తారక్ యమదొంగ సినిమా సెన్సేషన్ అనే చెప్పాలి, ఆ చిత్రంలో తారక్ డైలాగ్స్ రాజమౌళి దర్శకత్వం సినిమాకు ఫుల్ మార్క్ లు వేయించాయి.

మొత్తానికి ఓ సీనియర్ హీరోయిన్, కోలీవుడ్ అభిమాన తార , తారక్ గురించి ఇలా పొగడ్తలు చేయడంపై తారక్ అభిమానులు చాలా ఆనందంలో ఉన్నారు, మొత్తానికి తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ క్లిప్ ని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు.