దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నటుడిగా సినిమా – మరి దర్శకుడు ఎవరంటే

Movie starring K Raghavendra Rao

0
75
Director K Raghavendra rao

 

దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తీసిన అన్నీ సినిమాలు సూపర్ హిట్, హీరోని అద్భుతంగా చూపిస్తారు, వెండితెరపై దర్శకేంద్రుడు త‌న మార్క్ చూపించారు .ఇలా ఎందరో హీరోలని ఆయన తెరపై చూపించారు. సూపర్ హిట్ చిత్రాలు తీశారు. అయితే కొన్ని సంవత్సరాలుగా డైరెక్షన్ కి దూరంగా ఉంటున్నారు కె రాఘవేంద్రరావు .

తాజాగా తన జీవితంలో మరో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటి వరకూ దర్శకత్వం చేసిన ఆయన, ఆన్స్క్రీన్లోను కనిపించి సందడి చేయనున్నారట. నిజమే ఎందుకంటే ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి రాఘవేంద్రరావు ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే కథ వర్క్ అంతా పూర్తి అయింది.

ఈ కరోనా పరిస్దితులు చల్లారాక, సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించనున్నారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి లక్ష్మీ కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.అంతేకాదు మరో పాత్రలో నటి శ్రియ నటించనున్నారట.మరో పక్క రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో, శ్రీకాంత్ తనయుడు హీరోగా పెళ్లి సందడి చిత్రం రూపొందుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సినిమాల గురించి ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.